ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమళ్లీ బాక్సైట్‌ ‌భూతం

13 గంటల క్రితం

మళ్లీ బాక్సైట్‌ ‌భూతం
-ఇంగ్లండ్‌ ‌కోర్టు తీర్పుతో తెరపైకి
-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అనుమానాలు
జీవనాధారాలపై గిరిజనుల్లో ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:43 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇంగ్లాండ్ ‌కోర్టు తీర్పుతో తెరపైకి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అనుమానాలు

  • గిరిజనుల్లో ఆందోళన

​ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : ఇంగ్లండ్‌‌లోని అప్పిలేట్‌ కోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలో బాక్సైట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గిరిజనుల పోరాటం నేపథ్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకమని ఒకవైపు చెబుతూనే మరో వైపు కోర్టు తీర్పులను సాకుగా చూపించి అనుమతులిచ్చే వ్యూహానికి తెరతీస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరే దీనికి కారణం. ప్రజల పోరాటాలు ఉధృతంగా జరిగిన చోట ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపించినప్పటికీ అంతిమంగా కార్పొరేట్లకు అనుకూల వైఖరిని రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు ఆకర్షించే పేరిట కార్పొరేట్లకు రెడ్‌ ‌కార్పెట్‌ ‌పరుస్తోంది. బాక్సైట్‌ ‌ తవ్వకాలలో దేశంలో కీలకంగా వ్యవహరిస్తున్న వేదాంత సంస్థకు శ్రీకాకుళం జిల్లాలో మాంగనీసు తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించగా, అదే సంస్థకు బిజెపి అధికారంలో ఉన్న ఒడిషాలో బాక్సైట్‌ గనుల లైసెన్స్‌ ‌లభించింది. ఒడిశాలోని సిజిమాలి ప్రాంతంలో లభించిన ఈ అనుమతులకు వ్యతిరేకంగా అక్కడి గిరిజనులు ప్రస్తుతం పోరాటం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌, జులై నెలల్లో ఒడిషాలోని గిరిజనులు ఆందోళనలకు దిగారు. దాదాపుగా అదే సమయంలో మన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జెర్రెల అటవీ ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాల కోసం సర్వే చేస్తున్నారంటూ గిరిజనులు ఆందోళనలకు దిగారు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ సర్వే వెనుక వేదాంత సంస్థ ఉందన్న ఆరోపణలు అప్పుడు వచ్చాయి. చాపకింద నీరులా సాగుతున్న ఈ ప్రయత్నాల నేపధ్యంలో ఇంగ్లండ్‌‌లోని వేల్స్‌ అప్పీల్‌ ‌కోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర్ట్రానికి బాక్సైట్‌ తవ్వకాల ముప్పు పొంచి ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.

తాజా తీర్పు ఏమిటి?

బాక్సైట్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేస్తూ 2016లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్య కారణంగా తమకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని , అందువల్ల న్యాయం చేయాలని కోరుతూ అదే ఏడాది ఇంగ్లండ్‌‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ‌ట్రిబ్యునల్‌‌లో రాకియా సంస్థ కేసు దాఖలు చేసింది. అయితే, కేసు విచారణ పరిధి తమకు లేదంటూ, 2022 మే 11న ట్రిబ్యునల్‌ ‌తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్‌ ‌చేస్తూ రాకియా సంస్థ 2025 జూన్‌‌లో ఇంగ్లండ్‌‌లోని హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసింది. దీనిని విచారించిన హైకోర్టు ఆర్బిట్రేషన్‌ ‌ట్రిబ్యునల్‌‌ పరిధిలోకే ఈ కేసు వస్తుందని అభిప్రాయపడింది. ఆ మేరకు విచారణ కొనసాగించాలని ట్రిబ్యునల్‌‌కు స్పష్టం చేసింది. ఈ తీర్పును కేంద్ర ప్రభుత్వం సవాల్‌ ‌చేస్తూ ఈ ఏడాది మే లో కోర్టు ఆఫ్‌ అప్పీల్‌‌కు వెళ్లింది. దీనిని విచారించిన అప్పీల్‌ ‌కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును బలపర్చింది. ఆర్బిట్రేషన్ పరిధిలోనే కేసును తేల్చుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచించింది.

వివాదం ఏమిటి?

రాష్ట్రంలో బాక్సైట్‌ నిలువలను ఉపయోగించు కుని అలూమినా రిఫైనరీ, అల్యుమినియం స్మెల్టర్‌‌లను ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం రాస్‌ అల్‌ ‌ఖైమా, పెన్నా సిమెంట్స్‌ ‌సంస్థలు కలిసి అన్‌ ‌రాక్‌ అల్యూమినియం లిమిటెడ్‌‌గా ఏర్పాటయ్యాయి. 4,300కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్