శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమీరు చెప్పిన ఉద్యోగాలేవీ?

29 అక్టోబర్, 2026

tdp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 02:32 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నెరవేరని ‘కూటమి’ హామీ

  • ఐటి కంపెనీల పేరుతో కార్పొరేట్లకు ప్రభుత్వం భారీగా భూ పందారం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ర్టంలోని టిడిపి కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల ప్రచారంలో విశాఖ పరిశ్రమలు, ఐటి రంగం, ఉపాధి అవకాశాలపై ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటికీ అమలు కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్‌ ‌విశాఖ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జివిఎంసి) ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు టిడిపి, జనసేన, బిజెపి మళ్లీ ఇలాగే ఎరవేస్తున్నాయి. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ (ఐటి) కోసం అనేక సంస్థలకు విశాఖలోని కాపులుప్పాడ, రుషికొండ, మధురవాడ కొండలపై వందల ఎకరాల భూములను టిడిపి కూటమి ప్రభుత్వం దారాదత్తం చేసింది. డేటా సెంటర్ల పేరుతో అదాని, అంబాని వంటి కార్పొరేట్లకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టింది. విశాఖలో ఇది వరకే ఏర్పాటైన విప్రో, ఇన్ఫోసిస్‌, టెక్‌ ‌మహీంద్రా, మిరాకిల్‌ ‌సాఫ్ట్‌ ‌వేర్, ఇన్‌‌స్పైర్‌ ఎడ్జ్‌, ఐటి సొల్యూషన్స్‌, సయంట్‌ ‌వంటి ఐటి సంస్థల్లో హామీ ప్రకారం 20 వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా, ఆరు వేల లోపే ఉద్యోగులు ఐటి రంగంలో విధుల్లో ఉన్నారు. జీతాలు కనీసం రూ.25 వేలు కూడా ఈ సంస్థల్లో ఇవ్వడం లేదు. బెంగళూరు, పూణె, హైదరాబాద్‌‌లకు అత్యధికమంది నిరుద్యోగులు, ఐటి ఉద్యోగులు తరలిపోతున్నారు.

28 ఐటి కంపెనీలకు విశాఖ కొండలపై భూములు

ఎపిఐఐసి ద్వారా విశాఖను పారిశ్రామిక కేంద్రంగా ఐటికి నిలయంగా దేశంలో నిలుపుతాననే పేరుతో 2024లో టిడిపి కూటమి ప్రభుత్వం 28 ఐటి కంపెనీలకు విశాఖ కొండలపై భూములను కేటాయించింది. దీనివల్ల 76 వేల కోట్లా 500 కోట్ల పెట్టుబడులతో ఏడాది తిరిగేలోపు 1.30 లక్షలు పైచిలుకు ఉద్యోగాలొస్తాయంటూ, నిరుద్యోగులు ఎక్కడికీ వెళ్లవలసిన పనిలేదంటూ ఊదరగొట్టింది. కాపులుప్పాడలోని కొత్త క్యాంపస్‌‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ ‌ప్రారంభిస్తూ ఎనిమిది వేల ఉద్యోగాలు ఇస్తున్నామంటూ ఐదు నెలల క్రితం బహిరంగ సభలో ప్రకటించారు. 500 మంది ఉద్యోగులు (వీరు కూడా బెంగళూరులో పనిచేసే పాత ఉద్యోగులే) తప్ప ఒక్క ఐటి ఉద్యోగం కూడా కొత్తగా ఇక్కడ రాలేదు. ఐటి హిల్స్‌ ‌మధురవాడ, కాపులుప్పాడల్లో కాగ్నిజెంట్‌ ‌టెక్నాలజీ సొల్యూసన్స్‌‌కి, టిసిఎస్‌, కె హేజా కార్పొరేషన్‌‌, సత్వ రియల్‌ ఎస్టేట్‌ ‌డెవలపర్స్‌‌, ఎన్‌ఎస్‌ఆర్‌‌ గ్లోబల్‌, ఇన్ఫోసిస్‌ ‌విస్తరణ కోసం సుమారు వెయ్యి ఎకరాల వరకూ కేటాయింపులు చేశారు. ఈ ప్రదేశాల్లో గజం కనీసం రూ.2 లక్షల పైమాటే. గుర్రంపాలెంలో అవంతి వేర్‌‌హౌసింగ్‌ ‌రూ.114 కోట్లతో 900 మందికి ఉద్యోగాలంటూ ప్రకటనలు హుళక్కే అయ్యింది. ఇండ్రస్టియల్‌ ‌పార్కు అభివృద్ధి ద్వారా రూ.237 కోట్లతో ఐదు వేల మందికి ఉద్యోగావకాశాల కల్పన ప్రకటన ఎండమావేవిగా మారింది. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో ఇబ్బడిముబ్బడిగా ఐటి కంపెనీలు వచ్చి 1.88 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ, డేటా సెంటర్లతో ఉష్ణోగ్రతలు పెరిగి ఐటికి ముప్పు వస్తుందన్న భయాందోళనతో ఇంతవరకూ 28 ఐటి కంపెనీల్లో కాగ్నిజెంట్‌ ‌మినహా ఏ ఒక్కటీ విశాఖలో ప్రారంభించలేదు. డేటా సెంటర్లతో నెగెటివ్‌ ‌ప్రభావం ఐటిపై పడడంతో ప్రజలు, ప్రభుత్వానికి చెందిన రూ.వేల కోట్ల విలువైన భూములు కార్పొరేట్‌ ‌కంపెనీల చేతుల్లో పడ్డాయి తప్ప, ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్