న్యూఢిల్లీ : అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్, అఫ్గానిస్థాన్ మధ్య గురువారం సెమీఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత్ 228 పరుగుల లక్ష్యాన్ని చేరాల్సి వుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు నోమన్ సలార్‌జాయ్ (51), షా ఫైజల్ (51) రహిమీ హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ 9 ఓవర్లలో 43 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆర్యన్ సవ్‌సానీ రెండు వికెట్లు తీయగా, కావ్య పటేల్, యశ్‌వర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
IND vs AFG : అండర్-19 ఆసియాకప్ సెమీస్.. భారత్ టార్గెట్ 228
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 02:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)