రెండో టి20లో ఆఫ్ఘన్‌పై
టీమిండియా ఘన విజయం
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. అరుణ్ జైట్లీస్టేడియంలో ఆఫ్ఘన్‌తో మంగళవారం జరిగిన రెండో టి20లో టీమిండియా .. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అనంతరం టీమిండియా 14.5ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఛేదనలో భాగంగా ఓపెనర్లు సంజు శాంసన్(57) అర్ధసెంచరీకి తోడు అభిషేక్ శర్మ(39) తొలి వికెట్‌కు 6.2ఓవర్లలో 88పరుగులు జతచేసి గట్టి పునాది వేశారు. ఆ తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(11) నిరాశపరిచినా.. ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(15) మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ను టీమిండియాను బౌలర్లు తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి(3/24), ఆర్ష్‌దీప్(2/35)కి తోడు బుమ్రా, అక్షర్, బిష్ణోయ్ ఒక్కో వికెట్‌తో రాణించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 159పరుగులకే పరిమితమైంది. ఓపెనర్, కెప్టెన్ జడ్రాన్(37)కి తోడు రసూలీ(26), రషీద్ (28) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆజట్టు 67పరుగులకు చేరే సరికి నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో రసూలీ, నబీ, రషీద్ చివర్లో క్రీజ్‌లో పాతుకుపోయి జట్టు గౌరవప్రద స్కోర్‌కు దోహదపడ్డారు.
స్కోర్‌బోర్డు...
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్: జడ్రాన్ (సి)బిష్ణోయ్ (బి)నితీశ్ రెడ్డి 37, గుర్బాజ్ (సి)బిష్ణోయ్ (బి)ఆర్ష్‌దీప్ 0, సెద్ధిఖుల్లా (సి)తిలక్ వర్మ (బి)బిష్ణోయ్ 12, గుల్బద్దిన్ (సి)సంజు (బి)నితీశ్ రెడ్డి 10, డార్విష్ రసూలీ (సి)తిలక్ వర్మ (బి)ఆర్ష్‌దీప్ 26, అజ్మతుల్లా (సి)తిలక్ వర్మ (బి)అక్షర్ పటేల్ 11, నబి (సి)శ్రేయస్ (బి)బుమ్రా 20, రషీద్ ఖాన్ (సి)అక్షర్ పటేల్ (బి)నితీశ్ రెడ్డి 28, నూర్ అహ్మద్ (నాటౌట్) 7, ముజీబ్ (నాటౌట్) 4, అదనం 4. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 159పరుగులు.
వికెట్ల పతనం: 1/0, 2/51, 3/67, 4/67, 5/96, 6/100, 7/148, 8/148
బౌలింగ్: బుమ్రా 4-1-25-1, ఆర్ష్‌దీప్ 4-0-35-2, అక్షర్ పటేల్ 4-0-28-1, బిష్ణోయ్ 4-0-32-1, నితీశ్ రెడ్డి 3-0-24-3, దూబే -0-13-0.
ఇండియా ఇన్నింగ్స్: సంజు శాంసన్ (సి)నబీ (బి)రషీద్ ఖాన్ 57, అభిషేక్ శర్మ (సి)సెద్ధిఖుల్లా (బి)రషీద్ ఖాన్ 39, ఇషాన్ కిషన్ (నాటౌట్) 38, శ్రేయస్ అయ్యర్ (సి)జడ్రాన్ (బి)రషీద్ ఖాన్ 11, తిలక్ వర్మ (నాటౌట్) 15, అదనం 3. (14.5ఓవర్లలో 3వికెట్ల నష్టానికి) 163పరుగులు.
వికెట్ల పతనం: 1/88, 2/99, 3/123
బౌలింగ్: ముజీబ్ 3-0-37-0, నబీ 3-0-44-0, ఒమర్జాయ్ 2-0-25-0, రషీద్ ఖాన్ 3.5-0-36-3, నూర్ అహ్మద్ 2-0-14-0, ఫారూఖీ 1-0-6-0.







కామెంట్‌లు (0)