ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్ : మూలపాడులోని డివిఆర్‌ఎ స్టేడియంలో జరుగుతున్న రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత కోసం ఆంధ్ర, ఛత్తీస్‌గడ్ జట్లు పోటీపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు 231 పరుగులు చేయగా.. రెండోరోజు ఆట ముగిసేసరికి ఛత్తీస్‌గడ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అమన్‌దీప్ ఖారే(74)కి తోడు దేవ్ ఆదిత్య(2) క్రీజ్‌లో ఉన్నారు. తనుజ్ తివారి(34), జాదవ్ మండల్(29) బ్యాటింగ్‌లో రాణించగా.. ఆంధ్ర బౌలర్లు త్రిపురణ విజయ్‌కు మూడు, సౌరభ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. బుధవారం మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశముంది.
హైదరాబాద్ 193/2
జింఖానా మైదానంలో పంజాబ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు 431 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం హైదరాబాద్ జట్టు రెండోరోజ ఆట ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అభిరథ్‌రెడ్డి(97) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. రాహుల్ రాదేష్(72), హిమతేజ(2) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్ జట్టులో సలీల్ అంకోలా(151) భారీ శతకానికి తోడు, రమణ్‌దీప్ సింగ్(52), ఉమేశ్ యాదవ్(37నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. హైదరాబాద్ బౌలర్లు మిలింద్‌కు నాలుగు, చింథల్ రెడ్డికి మూడు వికెట్లు దక్కాయి.








కామెంట్‌లు (0)