ముంబయి: భారత క్రికెట్ మండలి(బిసిసిఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లకు పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అజింక్యా రహానే నెలకు పెన్షన్ కింద రూ.70వేలు అందుకోనున్నాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తమ రాష్ట్రం తరఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెటర్లకు పెన్షన్‌తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందజేయనున్నట్లు ప్రకటించింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా తమ మాజీ క్రికెటర్లకు కొంతమేర పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేందుకు ముందుకొచ్చాయి.
బుమ్రా స్థానంలో ఆకీబ్
శ్రీలంక పర్యటనకు గాయం కారణంగా దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన పేసర్ అకీబ్ నబీని జట్టులోకి తీసుకున్నట్లు బిసిసిఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రంజీల్లో ఆకీబ్ నబీకి గొప్ప రికార్డు ఉంది. 29 ఏళ్ల అకీబ్ నబీ జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ప్లేయర్. గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 104 వికెట్లు పడగొట్టగా.. 2025-26 సీజన్‌లో 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్‌కు తొలి రంజీ ట్రోఫీ టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడికి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. జమ్మూ కశ్మీర్ నుంచి భారత సీనియర్ జట్టుకు ఎంపికైన మూడో క్రికెటర్‌గా ఆకీబ్ నిలిచాడు. గతంలో పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ మాత్రమే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
పెన్షన్ నెలకు ఇలా...
మాజీ క్రికెటర్లు : రూ. 58,750
టెస్టు క్రికెటర్లు : రూ. 60 వేలు
సీనియర్ టెస్టు క్రికెటర్లు : రూ. 70 వేలు
ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు: రూ. 30 వేల నుంచి 45వేలు
అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు: రూ. 52,500
దేశవాళీ మహిళా క్రికెటర్లు: రూ. 45వేలు








కామెంట్‌లు (0)