గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionENG vs SL : బ్రూక్‌ సెంచరీ, బట్లర్‌ అర్ధసెంచరీ

15 గంటల క్రితం

brook.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 11:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలి టి20లో శ్రీలంకపై ఇంగ్లాండ్‌ ఘన విజయం

సౌథాంప్టన్‌: శ్రీలంకతో జరిగిన తొలి టి20లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ది రోజ్‌ బౌల్‌ స్టేడియంలో మంగళవారం జరిగిన తొలి టి20లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 254 పరుగులు స్కోరు చేసింది. ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (80), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (114 నాటౌట్‌) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఛేదనలో శ్రీలంక.. 19 ఓవర్లలో కేవలం 135 పరుగులకే ఆలౌటయ్యింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో సోనీ బేకర్‌ మూడు, లియామ్‌ డాసన్‌, జేమీ ఓవర్టన్‌ చెరో రెండు.. జోష్‌ టంగ్‌, విల్‌ జాక్స్‌, ఆదిల్‌ రషీద్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ సెంచరీతో పలు రికార్డులను తన పేర లిఖించుకున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ కేవలం 49 బంతుల్లో పది ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో బ్రూక్‌.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక శతకాలు కొట్టిన కెప్టెన్‌గా బ్రూక్‌ ప్రపంచ రికార్డు సాధించాడు. దీంతో మూడు టి20ల సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు 1-0 ఆధిక్యతలో నిలువగా.. రెండో టి20 కర్డీఫ్‌ వేదికగా గురువారం జరగనుంది. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్