దులీప్ ట్రోఫీ క్వార్టర్‌ఫైనల్స్
బెంగళూరు: దులీప్ ట్రోపీ సెమీఫైనల్లోకి ఈస్ట్‌జోన్ జట్టు ప్రవేశించింది. ఫాలోఆన్ ఆడుతూ నార్త్ ఈస్ట్‌జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 111 పరుగులకే కుప్పకూలిన నార్త్ ఈస్ట్‌జోన్ జట్టు ఫాలోఆన్ ఆడుతూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జోతిన్(39), ఆకాశ్ చౌదరి(27), కిషన్(25), థాపా(20) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఈస్ట్‌జోన్ బౌలర్లు అనుకుల్ రాయ్‌కు ఐదు, వైభవ్ సూర్యవంశీకి రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ జట్టు 467పరుగుల భారీస్కోర్ చేసిన సంగతి తెలిసిందే. 30నుంచి జరిగే సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ జట్టు సెంట్రల్ జోన్‌తో తలపడనుంది.
నార్త్-ఈస్ట్‌జోన్‌లను ఊరిస్తున్న విజయం
నార్త్-ఈస్ట్‌జోన్ జట్ల మధ్య జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో ఇరుజట్లను విజయం ఊరిస్తోంది. నార్త్‌జోన్ నిర్దేశించిన 287పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్ట్‌జోన్ జట్టు మూడోరోజు ఆట ముగిసేసరికి 7వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. విజయానికి మరో 67పరుగులు చేస్తే చాలు. ఇక మరో మూడు వికెట్లు పడగొడితే నార్త్‌జోన్ విజయం సాధించనుంది. క్రీజ్‌లో ఉర్విల్ పటేల్(17) ఉన్నాడు. వెస్ట్‌జోన్ బ్యాటర్ ముషీర్ ఖాన్(96) తృటిలో సెంచరీ మిస్ చేసుకోగా.. రుతురాజ్ గైక్వాడ్(66) అర్ధసెంచరీతో రాణించాడు.







కామెంట్‌లు (0)