మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది

1 గంట క్రితం

_kartikeya.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 11:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఇ నూకరాజు మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డి

ప్రజాశక్తి - కాకినాడ రూరల్ : సాదిక్ ఖాన్ వల్లే తమ కుటుంబం నాశనం అయ్యిందని, నాకు ఇప్పుడు ఎవ్వరూ లేరని, బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని పిఠాపురం పంచాయతీరాజ్ ఎఇ మనవడు రియాన్ష్ కార్తికేయరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. కార్తికేయ రెడ్డిని కాకినాడ ఎంపి ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం కాకినాడ కలెక్టర్ హరేంధీరప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు. కార్తికేయకు న్యాయం చేయాలని, ఆస్తిపరమైన అడ్డంకులు తొలగించి ఆదుకోవాలని కలెక్టర్‌ను ఎం‌పి కోరారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ఎంపి సమక్షంలో రియాన్ష్ మీడియాతో మాట్లాడాడు. తనకు మూడో తరగతి నుంచే రైఫిల్ షూటింగ్ అంటే ఇష్టమని, ఈ నేపథ్యంలో స్కూల్‌లో రైఫిల్ శిక్షణ పొందేవాడినని ‌సాధిక్‌ తెలిపాడు. స్కూల్లో సాధిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ కో‌చ్‌గా ఉన్నాడని తెలిపారు. అక్కడే అమ్మకు పరిచయం అయ్యాడని, తమ ఇంటికి కూడా వచ్చేవాడని, రోజూ అమ్మను కొట్టేవాడని తెలిపాడు. నాన్నకు ఆరోగ్యం బాగోకపోవడంతో ప్రతి రోజూ ప్రొటీన్ షేక్ తాగేవాడని, ఆ ప్రొటీన్ షేక్‌లో ‌సాదిక్ ఖాన్ కెమికల్స్ కలిపి నాన్నకు ఇచ్చేవాడని రియాన్ష్‌ వివరించాడు. అందుకే నాన్న చనిపోయాడని వాపోయాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, టెర్రరిస్టులకు అప్పగించేస్తాన్నంటూ తనను బెదిరించేవాడని చెప్పాడు. తమ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి, తనను అనాథను చేశాడని వాపోయాడు. ఇప్పుడు తనకు ఎవ్వరూ లేరని, ఇంకా భయంగానే ఉందని తెలిపాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్