మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionడిమాండ్లు నెరవేర్చాలని జూడాల నిరసన

1 గంట క్రితం

jr dr.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జిల్లా ఆస్పత్రుల వద్ద కొనసాగిన సమ్మె

  • సిఐటియు మద్దతు

ప్రజాశక్తి - యంత్రాంగం : న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె మంగళవారం కొనసాగింది. 16 రోజుల నుండి రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు సిఐటియు, పలు సంఘాలు మద్దతు తెలిపాయి. గుంటూరు జిజిహెచ్‌‌లో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యుల స్టైఫండ్‌ ‌పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించటం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం (జెవికె) ఆర్గనైజింగ్ కార్యదర్శి వి.వి.కె.సురేష్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు అవసరమైన నిధులను ఇప్పటికైనా బడ్జెట్‌‌లో కేటాయించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తూ నిత్యం పేదలకు సేవలందిస్తున్న జూనియర్ వైద్యుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జాషువా విజ్ఞాన కేంద్రం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఎన్. భావన్నారాయణ, మున్సిపల్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు బి.ముత్యాలరావు, ఎల్.ఐ.సి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డివిజనల్ సంయుక్త కార్యదర్శి ఎమ్.రాజేశ్వరరావు, సిఐటియు నేతలు కె.శ్రీనివాస్, కె.నళినీకాంత్, కాకుమాను నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. విజయనగరం సర్వ జన ఆస్పత్రి వద్ద తమ నిరసన శిబిరం కొనసాగించారు. ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె కొనసాగించారు. విశాఖలో జూనియర్‌ ‌డాక్టర్లు కెజిహెచ్‌ ‌ప్రాంగణంలో చేపట్టిన రిలే దీక్షలకు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.అజయ్‌ ‌మద్దతు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్