గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమారిన సింహం

1 గంట క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 04:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అడవికి రాజు సింహం, దానికి గర్వం మెండు

మృగములన్ని భయపడి, వణికిపోయే గుండు!


కనికరం లేని సింహం, అడవిని పాలిస్తుంటే

జీవాలన్నీ తల్లడిల్లి, భయంతో వణుకుతుంటే


ఒకనాడు సింహానికి, మాంసమంటే విరక్తి

శాకాహారిగా మారాలని, కలిగింది ఒక యుక్తి!


ఎండాకాలపు వేడికి, మామిడి పళ్ల ధ్యాస

ఎక్కడ చూసినా దొరకక, తీరని కడుపు ఆశ!


చెట్టు నీడన కూర్చోగా, తియ్యని వాసన రాగా

తల ఎత్తి చూడగా, కోతి కనిపించగా!


"మామిడి పళ్లు కోసి ఇవ్వు, ఆజ్ఞ ఇది రాజా"

"రాను నేను కిందికి, చంపేస్తావు కాదా?"


"మాంసం తినను మిత్రమా, భయపడకు త్వరగా"

కోతి పళ్లు విసరగా, సింహం కోపించెను వేగ!


"నేల పడిన ఎంగిలి పళ్లు, తినను నేను అస్సలు

నా స్థాయి వేరు కదా, ఏముంది నాలో అసలు?"


నిరాశతో సింహం, గుహకు చేరిన తరుణం

గుహ ముందు కోతి చూసి, మారింది కదా పయనం!


బుట్ట నిండా పళ్లతో, కోతి నిలబడి ఉండె

అతిథి సత్కారముతో, మనసు గెలిచి ఉండె!


సింహం తిన్నది పళ్లను, లొట్టలేసి హాయిగా

మారిపోయెను సింహం, ప్రశాంతమై పోయిగా!


హింసను వదిలేసి, అహింసను నమ్మెను

మంచితనపు బాటలో, అడవిని నిలిపెను!

- పైడిమర్రి రామకృష్ణ

92475 64699


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్