గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజు అల్లరి

1 గంట క్రితం

katha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజు చాలా అల్లరి చేసే విద్యార్థి. అతన్ని చూసి మరికొందరు విద్యార్థులు కూడా బాగా అల్లరి చేసేవారు. టీచర్లు రాజుకు రోజుకో విధంగా శిక్షలు విధించినా, తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజులో మార్పు రాలేదు.

ఒకరోజు శివ సార్, “ఇకపై రాజును శిక్షించకండి. అతనికి ఒక బాధ్యత ఇస్తే మార్పు వస్తుంది” అని చెప్పారు. వెంటనే రాజును క్లాస్ లీడర్‌గా నియమించారు. “తరగతి క్రమశిక్షణను కాపాడటంలో క్లాస్ టీచర్ తర్వాత నీదే ముఖ్యమైన బాధ్యత” అని చెప్పి అతనిపై నమ్మకం ఉంచారు.

ప్రతిరోజూ అసెంబ్లీలో రాజును అభినందించేవారు. అలాగే తల్లిదండ్రులకు కూడా ఇంట్లో చిన్నచిన్న బాధ్యతలు అప్పగించి, వాటిని సక్రమంగా నిర్వహించినప్పుడు తప్పకుండా ప్రశంసించాలని సూచించారు. కొద్ది రోజుల్లోనే రాజులో అద్భుతమైన మార్పు వచ్చింది. అల్లరి విద్యార్థిగా పేరొందిన రాజు, క్రమశిక్షణగల ఆదర్శ విద్యార్థిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు.

నీతి: శిక్ష కంటే బాధ్యత, నమ్మకం, ప్రశంసలు పిల్లల్లో మంచి మార్పును తీసుకొస్తాయి.

– ఎం.వి. స్వామి

94415 71505

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్