గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇక మంధాన శకం

2 గంటల క్రితం

15smriti(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 01:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కెప్టెన్‌గా స్మృతికి తొలి పరీక్ష

  • జింబాబ్వేతో భారత్‌ తొలి టి 20 నేడు

రాయ్‌పూర్‌ : భారత మహిళల క్రికెట్‌ జట్టు నాయకత్వ మార్పిడి దశ సజావుగా ముగిసింది. ఆసియా క్రీడల్లో పసిడి పతక విజయం అనంతరం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా, కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్సీలో భారత్‌ తొలిసారి ఐసిసి వన్డే వరల్డ్‌కప్‌ విజయాన్ని అందుకోగా.. ఆసియా క్రీడల్లో వరుసగా చాంపియన్‌గా నిలిచింది. వైస్‌ కెప్టెన్‌గా నాయకత్వ బృందంలో కొనసాగుతున్న మంధాన ఇక నేరుగా సారథ్య బాధ్యతలు అందుకోనుంది. భారత్‌, జింబాబ్వే తొలి టి 20 నేడు రాయ్‌పూర్‌లో జరుగనుండగా.. స్మృతి మంధాన నాయకత్వ శకం సైతం ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ రాయ్‌పూర్‌లోనే జరుగనుండగా భారత్‌ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మిడిల్ ఆర్డర్‌లో కీలకం కానుండగా.. షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌, దీప్తి శర్మ సహా శ్రీ చరణి, క్రాంతి గౌడలు భారత్‌కు కీలకం. జింబాబ్వే మహిళలు కాగితంపై బలహీనంగా కనిపించినా, అగ్రజట్టు భారత్‌తో తమదైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తోంది. వరుసగా ఎనిమిది టీ20ల్లో విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా.. జింబాబ్వేపై హ్యాట్రిక్‌తో రికార్డును మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. భారత్‌, జింబాబ్వే తొలి టి 20 శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్