- ఆస్ట్రేలియా-ఎ పై 162 పరుగుల తేడాతో గెలుపు
పుదుచ్చేరి: ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో ఇండియా-ఎ 4 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఎడమచేతి వాటం స్పిన్నర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లతో రాణించి ఆసీస్‌ను దెబ్బతీశాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం తన ఖాతాలో ఏడు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. పుదుచ్చేరి సిఎసి-సీచెమ్ స్టేడియంలో 363 పరుగుల భారీ ఛేదనలో ఓవర్‌నైట్ స్కోర్ 55 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 200 పరుగులకే కుప్పకూలింది. మీడియం పేసర్ అన్షుల్ కాంబోజ్ తొలి సెషన్‌లో రెండు వికెట్లు తీశాడు. నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌ను ఔట్ చేశాడు. దీంతో భోజన విరామ సమయానికి ఆస్ట్రేలియా-ఎ 185 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. కుమార కుషాగ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో, చివరి టెస్టు 29 నుంచి జరగనుంది.
స్కోరు బోర్డు
ఇండియా ఏ 334, 199
ఆస్ట్రేలియా 171, 200







కామెంట్‌లు (0)