- నేడు భారత్, పాకిస్తాన్ మధ్య కీలక పోరు
- అండర్-19 ఆసియా కప్
అండర్-19 ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం కీలక పోరు జరగనుంది. గ్రూప్-ఎలో ఉన్న ఈ రెండు జట్లు శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. భారతజట్టు 10వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తుచేయగా.. పాకిస్తాన్ జట్టు యుఎఇ నిర్దేశించిన 225 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ కోల్పోయి 37.3ఓవర్లలోనే ఛేదించింది. ఈ రెండు జట్లు గ్రూప్-ఎలో ఉన్న నేపథ్యంలో ఇరుజట్ల మధ్య నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు టాప్ బెర్త్ దక్కనుంది. నేపాల్‌పై ఆర్యవీర్ సెహ్వాగ్, లక్ష్య రైచందాని అర్ధసెంచరీలతో రాణించారు. బౌలింగ్‌లో అర్జున్ రాజ్‌పుత్, ఇషన్ ధీరజ్ మూడేసి వికెట్లు, వుట్కూరి యశ్వీర్ రెండు వికెట్లతో అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఇక పాకిస్తాన్‌జట్టును ఏమాత్రం తక్కువ అవచనా వేయడానికి వీల్లేదు. ఇస్మాన్ ఖాన్ యుఎఇపై సెంచరీతో మెరిసాడు. బౌలింగ్‌లో మహ్మద్ సయ్యం, హస్‌నైస్ ధార్, అలీ రాజా రాణిస్తున్నారు. దీంతో ఇరుజట్ల మధ్య జరిగే ఈ పోరు హోరాహోరీగా సాగడం ఖాయం.







కామెంట్‌లు (0)