గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరోహిత్‌, కోహ్లి, జడేజాలకు చోటు

15 గంటల క్రితం

team-india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 11:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వెస్టిండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌తోపాటు ఆసియా క్రీడలకు జట్లను ప్రకటించిన బిసిసిఐ

ముంబయి: ఈనెలాఖరులో వెస్టిండీస్‌తో జరిగే వన్డే, టి20లతోపాటు, ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్‌ జట్టును సెలెక్ష‍న్‌ కమిటీ జట్లను ప్రకటించింది. ముంబయిలోని బిసిసిఐ కార్యాలయంలో చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో సమావేశమైన బోర్డు.. విండీస్‌తో వన్డే, టి20లతోపాటు ఆసియా క్రీడలకు జట్లను ప్రకటించింది. బిసిసిఐ బుధవారం ప్రకటించిన వన్డే జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజాలకు చోటు లభించగా.. టి20 ఫార్మాట్‌కు వీరంతా గుడ్‌బై చెప్పిన క్రమంలో వీరి స్థానంలో కుల్దీప్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌లకు చోటు దక్కింది. ఇక తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డికి విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకు చోటు దక్కడంతో వర్క్‌లోడ్‌లో భాగంగా ఆసియా క్రీడలకు దూరమయ్యాడు. ఈ విషయాలను చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగర్కార్‌ బుధవారం ప్రకటించారు. గాయపడ్డ వరుణ్‌ చక్రవర్తి స్థానంలో విప్‌రాజ్‌ నిగమ్‌ను ఆసియా క్రీడలకు టి20 జట్టులో చోటు కల్పించినట్లు.. వరుణ్‌ను విండీస్‌తో జరిగే వన్డే, టి20 సిరీస్‌లకూ విశ్రాంతినిచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌కు ఇదే చివరి సమావేశం కానున్నట్లు సమాచారం. రోహిత్‌, కోహ్లితోపాటు ఆటగాళ్లతో విభేదాల కారణంగా అగార్కర్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు తెలిసింది.

విండీస్‌తో సిరీస్‌కు భారత జట్టు..

వన్డేలకు : గిల్‌(కెప్టెన్‌), రోహిత్‌, కోహ్లి, గైక్వాడ్‌, కెఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), జురెల్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, జడేజా, కుల్దీప్‌, ప్రసిధ్‌, గుర్నూర్‌ బ్రార్‌, సిరాజ్‌, ఆకిబ్‌ నబీ, జైస్వాల్‌, నమన్‌ ధీర్‌.


టి20: శ్రేయస్‌(కెప్టెన్‌), అభిషేక్‌, సంజు(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌, సూర్యవంశీ, దూబే, తిలక్‌(వైస్‌ కెప్టెన్‌), దూబే, కుల్దీప్‌, అక్ష‍ర్‌, సుందర్‌, బిష్ణోయ్‌, నితీవ్‌, ఆర్స్‌దీప్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌.


ఆసియా క్రీడలు: శ్రేయస్‌(కెప్టెన్‌), అభిషేక్‌, సంజు(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌, దూబే, తిలక్‌ వర్మ(వైస్‌ కెప్టెన్‌), అక్ష‍ర్ పటేల్‌, సుందర్‌, బిష్ణోయ్‌, బుమ్రా, ఆర్స్‌దీప్‌, సూర్యవంశీ, యశ్‌ ఠాకూర్‌, విప్‌రాజ్‌ నిగమ్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్