బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Ranji Trophy : ప్రియాన్షు ట్రిపుల్‌ సెంచరీ

15 గంటల క్రితం

jakca.jpg.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 10:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వడోధర : వడోధర వేదికగా జమ్మూ-కాశ్మీర్‌పై బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా(321) చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బరోడా తరఫున అజేయమైన ట్రిపుల్‌ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 79 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1947లో గుల్ మహమ్మద్ చేసిన 319 పరుగుల నేటి వరకు బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ రికార్డును ప్రియాన్షు అధిగమించాడు.

ప్రియాంన్షు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహేశ్ పిథియాతో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పిథియా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ (102) సాధించాడు. ప్రియాంన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది. జమ్ము-కాశ్మీర్‌ బౌలర్లు సాహిల్‌ లోత్రాకు నాలుగు, ఉమర్‌ నాజిర్‌, వంషజ్‌ శర్మకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్ము-కాశ్మీర్‌ జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్