mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

షఫాలీ హాఫ్ సెంచరీ.. బంగ్లాదేశ్‌పై భారత్ సూపర్ విక్టరీ

1 గంట క్రితం

ban vs ind.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టుకు భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. దీంతోబంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసి, భారత్‌కు 137 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బ్యాటర్లలో జురియా ఫెర్డోస్ 33 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నిగర్ సుల్తానా (32), శోభనా మోస్తరీ (22), షోర్నా అక్తర్ (13) కాస్త రాణించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ అత్యుత్తమంగా 3 వికెట్లు పడగొట్టగా, శ్రీ చరణి 2, రేణుకా సింగ్, నందని శర్మ చెరో వికెట్ సాధించారు.

అనంతరం 137 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఓపెనర్ షఫాలీ వర్మ 53 పరుగులతో బాధ్యతాయుతమైన అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించగా, జెమిమా రోడ్రిగ్స్ (26), యాస్తికా భాటియా (23) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగిలిన బ్యాటర్లలో రిచా ఘోష్ 10, స్మృతి మంధాన 8, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (13), దీప్తి శర్మ (5)పరుగులు చేసి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్