mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఒంగోలు టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఎసిబి సోదాలు

1 గంట క్రితం

ONG ACB
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 11:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సూపర్‌‌వైజర్‌‌తో సహా 12 మంది సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు

ప్రజాశక్తి - ఒంగోలు సిటీ : ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ విభాగంలో గురువారం ఎసిబి దాడులు నిర్వహించింది. టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్ రసూల్‌తో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న మరో 12 మంది సిబ్బంది ఇళ్లపై ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది. గత మార్చిలో కార్పొరేషన్ టౌన్‌ప్లానింగ్ విభాగంలో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన ఆధారాలు, అనంతరం గుర్తించిన డిజిటల్ లావాదేవీలే తాజా దాడులకు కారణమైనట్లు తెలిసింది. ఉదయం నుంచే ఎసిబి బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఒకేసారి మోహరించాయి. నెల్లూరు బస్టాండ్ సమీపంలోని రెడ్డమ్మ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రసూల్ ఇంటితో పాటు సంతపేట బచ్చలబాలయ్య కళ్యాణమండపం వద్ద ఉంటున్న టిపిబిఒ మూల రఘురామ్ ప్రవీణ్‌రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి. టిపిబిఒలు కాకర్ల మణిరావు, ముఖేష్‌కుమార్, డబ్ల్యూపిఆర్‌ఎస్‌లుగా పనిచేస్తున్న కాసినబోయిన ప్రవీణ్‌కుమార్, పుల్లేటికుర్తి తరుణ్‌కుమార్, బక్కమంతుల ప్రవీణ్‌కుమార్, దీపావత్ రవితేజ, బలగాని శరత్, కనగాల లక్ష్మిపావని, గండు శ్రీకాంత్, వల్లభుని పర్వీన్ హర్ష, దేవరపల్లి శశిధర్ నివాసాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. సోదాల సందర్భంగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, భూములు, ఇళ్ల కొనుగోళ్ల పత్రాలు వంటి అంశాలను ఎసిబి అధికారులు జల్లెడ పడుతున్నట్లు సమాచారం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్