శ్రీలంక- ‘ఎ’ జట్టుతో అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ ఓపెనర్ సాయి సుదర్శన్ శతక్కొట్టాడు. దిలుమ్ సుదీర బౌలింగ్‌లో సింగిల్ తీసి వంద పరుగుల మార్కు అందుకున్నాడు. 130 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్ ఆడేందుకు భారత్- ‘ఎ’ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇరుజట్ల మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లలో ఆయుశ్ పాండే (25) నామమాత్రపు స్కోరుకే వెనుదిరగగా.. వన్‌డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (12) కూడా విఫలమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓపెనర్ సాయి సుదర్శన్ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ 53 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే. . తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 175 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్.. 19 ఫోర్ల సాయంతో 132 పరుగులు సాధించాడు. చమిక గుణశేఖర బౌలింగ్‌లో దులాజ్ సముదితకు క్యాచ్ ఇచ్చి సాయి పెవిలియన్ చేరాడు.
Print Editionశ్రీలంకతో టెస్టు.. శతక్కొట్టిన భారత ఓపెనర్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)