డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారికి వినతిప్రతం ఇచ్చిన యూనియన్ నాయకులు
ప్రజాశక్తి - గుంటూరు : వ్యవసాయ మార్కెట్ కమిటీలలో 30 ఏళ్లుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర నాయకులు కోరారు. ఈ మేరకు గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ కార్యాలయ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారి కె.శ్రీనివాసరావుకు గురువారం యూనియన్ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మినిమం టైం స్కేల్ జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ చెల్లించాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. శ్రీనివాసరావు స్పందిస్తూ ఉద్యోగులకు న్యాయం చేయటానికి తమ వంతు కృషి చేస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసులు, పి.మధు, కోశాధికారి వి.సూర్యప్రకాష్, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, రాష్ట్ర నాయకులు కె.మహేష్, జె.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)