మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

SL vs IND టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన

1 గంట క్రితం

test team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీలంక, భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ మొదలుకానుంది. ఆగస్టు 15న గాలెలో తొలి టెస్టు, 23న కొలంబోలో రెండో టెస్టు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్‌స్పిన్నర్ సరాంశ్‌ జైన్‌ తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. గాయాల కారణంగా నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణాలను సెలక్టర్లు పక్కనపెట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లకు బీసీసీఐ సెంటర్ ఆఫ్‌ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్ వస్తే.. మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటారు. తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ రెండో టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు.

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్‌ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్*, ధ్రువ్‌ జురెల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్, మానవ్ సుతార్, జస్‌ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవ్‌దత్ పడిక్కల్, సరాంశ్ జైన్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్