మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కొనసాగుతున్న దస్తావేజు లేఖరుల నిరసన

1 గంట క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : జీవో నంబర్ 396 వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరులు నిర్వహిస్తున్న నిరసన కొనసాగుతుంది. మంగళవారం రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు చేపడుతున్న నిరసనకు పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్‌ఎస్‌కెలు ఏర్పాటు చేయడం వల్ల లేఖరులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జిల్లాలో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 1000 మంది ఈ వృత్తి పై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఈ జీవోను ఉపసంహరించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీ వో రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో సంఘం జిల్లా అధ్యక్షుడు జాడా అప్పలరాజు యాదవ్, కార్యదర్శి గీసాల శ్రీనివాస్ రావు, మేడిశెట్టి శ్రీను తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్