మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

"చలో గుంటూరు కలెక్టరేట్" వాల్ పోస్టర్ ఆవిష్కరణ

6 గంటల క్రితం

mangalagiri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -నవులూరు : ‘చలో గుంటూరు కలెక్టరేట్‌’ వాల్‌ పోస్టర్‌ను మునిసిపల్ కార్మికులు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులతో సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడారు. మున్సిపాలిటీలలో 14 కీలక విభాగాలలో పౌర సేవల ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనీ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 975, 673 లను రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని రవి కోరారు. తల్లికి వందనం పథకమును మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు వర్తింపజేయాలని అన్నారు. 12వ పిఆర్సి కమిషన్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుదల, పని భద్రత, హైకోర్టు ఆదేశాల మేరకు పర్మినెంట్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపాలిటీలలో పౌర సేవల ప్రైవేటీకరణ ను, పని గంటల పెంపును ఉప సంహరించుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా జూలై 30న కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలో కార్మికు లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ నెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి జరిగే కార్మిక ర్యాలీ, అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నా లో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్