మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

WI vs PAK: విండీస్ బౌలర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు

1 గంట క్రితం

pak vs wi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 05:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ట్రినిడాడ్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో తన సెకండ్ స్పెల్‌లో ఒక్క పరుగూ ఇవ్వకుండా.. వరసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ చొప్పున  మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌లో మూడో రోజు పాకిస్థాన్ 244/4 స్కోరుతో ఉండగా తన రెండో స్పెల్ మొదలుపెట్టిన జస్టిన్ గ్రీవ్.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. వరస ఓవర్లలో షాన్ మసూద్ (109), ఆమీర్ జమాల్ (3), అలీ ఉస్మాన్ (0), మహ్మద్ రిజ్వాన్ (12), మహ్మద్ అబ్బాస్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. భారీ స్కోరు చేసేలా కనిపించిన పాక్.. గ్రీవ్స్ దెబ్బకు 282 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో విండీస్ 126/7తో నిలిచి 155 పరుగుల ఆధిక్యంలో ఉంది.

కాగా టెస్టుల్లో గ్రీవ్స్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. 2016 జనవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్ వరసగా నాలుగు వికెట్ మెయిడిన్ల రికార్డును జస్టిన్ గ్రీవ్స్ తాజాగా బ్రేక్ చేశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్