న్యూఢిల్లీ : జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనకు సంబంధించి తాను చేసిన కృషికి గాను, ఆర్‌ఎస్‌ఎస్ తన అధికారిక పత్రిక 'ఆర్గనైజర్'లో తనను "సమస్యాత్మకులు... ప్రమాదకారులు"గా పరిగణించే వారి జాబితాలో చేర్చడం పట్ల తాను సంతోషంగా ఉన్నానని ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. ఈ జాబితాలో జాన్ బ్రిట్టాస్ పేరు మూడవ స్థానంలో ఉంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనను అప్రతిష్టపాలు చేయడానికి, దేశ వ్యతిరేక చర్యగా చిత్రీకరించడానికి ఆర్‌ఎస్‌ఎస్, 'గోడీ మీడియా' తీవ్రంగా ప్రయత్నించాయని, ఈ హిట్‌లిస్ట్ వారి యత్నానికి మరో రూపమని మండిపడ్డారు. విద్యా సంబంధిత సమస్యలపై శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనను చైనాతో ముడిపెట్టడానికి కూడా ఆర్‌ఎస్‌ఎస్, గోడీ మీడియా యత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతకాలంగా దేశ యువతలో పేరుకుపోతున్న ఆగ్రహం ఒక జ్వాలలా బయటకు వచ్చిందని అన్నారు. మోడీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని, నిరసన ఉద్దేశ్యాన్ని, స్వచ్ఛతను అంగీకరించాలని అన్నారు.
ప్రతిపక్ష సంస్థలు, విద్యార్థి సంఘాలు విద్యార్థి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాయి. వారితో పాటు ఎంతోమంది ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్దతుగా ముందుకు వచ్చారు. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. పోలీసులు గతంలో ఎన్నడూ లేనంతగా క్రూరంగా ప్రవర్తించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని కూడా ఆర్‌ఎస్‌ఎస్ సమస్య సృష్టికర్తల జాబితాలో చేర్చింది. కానీ, అరుంధతీ రాయ్, సంజయ్ సింగ్‌ల పేర్ల కంటే తన పేరును చాలా పైస్థానంలో ఉంచారని, ఆర్‌ఎస్‌ఎస్ తనకు అంతటి కీర్తిని ఇవ్వకూడదని జాన్ బ్రిట్టాస్ ఎద్దేవా చేశారు. తాను ప్రజల కోసమే ప్రజారంగంలో నిలబడ్డానని, ఆర్‌ఎస్‌ఎస్, గోడీ మీడియా నుంచి ఎలాంటి ఆదరణ గానీ, ప్రోత్సాహం గానీ ఆశించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను స్వీకరించి, వారి కోసం ఉద్యమానికి నాయకత్వం వహించడానికే తమని ఎన్నుకున్నారని అన్నారు. తమను హిట్ లిస్ట్‌లో చేర్చారన్న కారణంతో ఈ పోరాటం నుండి వైదొలుగుతామని భ్రమపడవద్దని హెచ్చరించారు. ఇటువంటి బెదిరింపులు, హిట్ లిస్ట్‌లను తాను కేవలం మీ ఆమోదానికి ఒక చిహ్నంగానే చూస్తున్నానని జాన్ బ్రిట్టాస్ పునరుద్ఘాటించారు.
జంతర్ మంతర్ నిరసన: 'ఆర్గనైజర్' జాబితా పట్ల సంతోషంగా వున్నా. : జాన్ బ్రిట్టాస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 28, 2026, 06:18 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)