సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

NZ vs IND: ఐదు వన్డేల సిరీస్‌ భారత్‌ వశం

13 గంటల క్రితం

india.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 04:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మౌంట్‌ మాంగనుయ్‌ : ఆదివారం జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్‌పై 22 పరుగుల తేడాతో విజయం సాధించి, వన్డే సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఈ విజయంతో కివీస్ గడ్డపై న్యూజిలాండ్‌కు ఉన్న సుదీర్ఘ అజేయ రికార్డుకు భారత్ తెరదించింది. గత ఏడేళ్లలో సొంతగడ్డపై వరుసగా 11 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను న్యూజిలాండ్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2019 తర్వాత కివీస్ జట్టు తమ దేశంలో వన్డే సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి కాగా, అప్పుడు కూడా భారత్ చేతిలోనే ఓటమి పాలవడం గమనార్హం. భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్‌కు విదేశాల్లో ఇదే తొలి వన్డే సిరీస్ విజయం. న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌ (న్యూజిలాండ్‌ vs భారత్‌ ) ఇప్పటికే టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ఇండియా 3-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ గెలవగా.. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. నాలుగో మ్యాచ్‌లో కివీస్ గెలిచింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 42.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో కివీస్ 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (31) టాప్ స్కోరర్. నిక్ కెల్లీ (24), మిచెల్ శాంటర్న్ (24), విల్ యంగ్ (22), మైకేల్ బ్రాస్‌వెల్ (19), క్రిస్టియన్ క్లార్క్ (16) పరుగులు చేశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, అక్షర్ పటేల్ 2, సిరాజ్ 2, అకిబ్ నబీ, యశ్‌ ఠాకూర్, నమన్ ధిర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


భారత్‌ బ్యాటర్లలో అక్షర్ పటేల్ (46; 55 బంతుల్లో), ఇషాన్ కిషన్ (46; 58 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రేయస్ అయ్యర్ (22), రుతురాజ్ గైక్వాడ్ (18) , రోహిత్ శర్మ (7), విరాట్ కోహ్లీ (5) రన్స్ చేశారు. చివర్లో మహ్మద్ సిరాజ్ (14*; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌), అర్ష్‌దీప్ (14; 4 బంతుల్లో 2 సిక్స్‌లు) విలువైన పరుగులు రాబట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్