క్రికెట్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరిగా, వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజంగా పేరొందిన సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, బార్బడోస్‌లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో క్రికెట్ ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోబర్స్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల క్రికెట్ బోర్డులు, క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. "క్రీడలోని నిజమైన ఐకాన్, గొప్ప ఆల్ రౌండర్" అంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆయనకు నివాళులర్పించింది. సోబర్స్ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుందని 'ఎక్స్' వేదికగా పేర్కొన్న బీసీసీఐ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి భారత ఆటగాళ్లతో ఆయన సంభాషిస్తున్న వీడియోను కూడా పంచుకుంది. "ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది" అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు, "ఆయన ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటారు" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నాయి.
భారత మాజీ క్రికెటర్లు సైతం సోబర్స్‌కు నివాళులర్పించారు. "క్రికెట్ ప్రపంచం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన ప్రతిభ, వినయం ఎందరికో స్ఫూర్తిదాయకం" అని హర్భజన్ సింగ్ కొనియాడారు. "ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది" అని ఇషాంత్ శర్మ పేర్కొన్నారు. సోబర్స్ ప్రభావం ఆటగాళ్లు, అభిమానులపై కలకాలం నిలిచి ఉంటుందని అజింక్యా రహానే తెలిపారు.
సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్‌కు క్రీడా లోకం నివాళి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 07:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)