శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవాంగ్‌‌చుక్‌ ఆరోగ్యంపై సిపిఎం ఆందోళన

1 గంట క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 07:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢిల్లీ: సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌ ఆరోగ్యం క్షీణించడంపై సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పొలిట్‌‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆందోళన, నిరసన చేస్తున్న నాయకులు, విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం చూస్తుంటే ఆ ప్రభుత్వ నిరంకుశ స్వభావం, ఏ మాత్రం సున్నితత్వం లేకపోవడం వెల్లడవుతోందని పొలిట్‌‌బ్యూరో పేర్కొంది. ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడానికి మూలాలు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి). 2020లో వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తున్న ఈ విద్యా వ్యవస్థ కేంద్రీకరణ, వ్యాపారీకరణలే కోచింగ్‌ సంస్థలు పుట్టగొడు గుల్లా పుట్టుకురావడానికి దారితీస్తు న్నాయని పేర్కొంది. మతతత్వంతోపాటు పేపర్‌ ‌లీకేజికి, అన్ని రకాల అవకతవకలకు ఇదే మూల కారణమని పొలిట్‌‌బ్యూరో విమర్శించింది. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయాలని, ఎన్‌‌టిఎను, ఎన్‌ఇపి-2020ని రద్దుచేయాలన్న డిమాండ్‌‌ను సిపిఎం పునరుద్ఘాటించింది. సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌, నిరసన తెలుపుతున్న ఇతర విద్యార్ధులకు సంఘీభావంగా నిలవాల్సిం దిగా అన్ని శాఖలకు, సంబంధిత రంగాల ప్రముఖులకు పొలిట్‌‌బ్యూరో పిలుపునిచ్చింది. ఈ డిమాండ్ల సాధనకు, సోనమ్‌ ‌వాంగ్‌‌చుక్‌‌కు సంఘీభావంగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్