శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జానీ మాస్టర్‌కు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సహాయ నిరాకరణ

1 గంట క్రితం

jany master
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 08:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం

హైదరాబాద్‌: జానీ మాస్టర్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో ఆయనకు సహాయ నిరాకరణ ప్రకటించింది. జానీ మాస్టర్ ఏ సినిమాలో పనిచేసినా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు సహకరించబోరని తెలిపిన ఫెడరేషన్, విచారణకు హాజరుకాకపోవడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయించిన గడువులోగా సరైన వివరణ ఇవ్వకపోతే శాశ్వత బహిష్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఈ పరిణామం టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవేళ ఫెడరేషన్ ప్రకటించిన సహాయ నిరాకరణ అమల్లోకి వస్తే.. జానీ మాస్టర్‌తో సినిమా చేయాలనుకునే నిర్మాతలు, దర్శకులకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. పరిశ్రమలోని వివిధ క్రాఫ్ట్‌ల మధ్య ఐక్యత, సంఘాల నిర్ణయాల ప్రాధాన్యత మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అందరి దృష్టి జానీ మాస్టర్ ఎలా స్పందిస్తాడనే అంశంపై ఉంది. జానీ మాస్టర్ వివరణ తర్వాత ఫెడరేషన్ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్