శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చైనాలో భారీ వర్షాలు బీభత్సం.. ఎనిమిది మంది మృతి

1 గంట క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 08:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు చైనాలో విషాదాన్ని మిగిల్చాయి. చాంగ్‌కింగ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో పది మందికి పైగా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 34 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వుజియాంగ్ నది సమీపంలోని పెంగ్‌షుయ్ కౌంటీలో ఈ ప్రమాదం సంభవించింది. కుండపోత వర్షాల ధాటికి కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు జారిపడటంతో 10కి పైగా నివాస భవనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు.

సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ ‘లెవెల్-II’ జాతీయ అత్యవసర ప్రతిస్పందనను ప్రకటించింది. విపత్తు నివారణ కమిషన్ కూడా సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 1,100 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్