గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్–శ్రీలంక తొలి వన్డేకు విశాఖ ఆతిథ్యం

1 గంట క్రితం

1990369-screenshot-2025-12-15-212159.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఢిల్లీ నుంచి వేదిక మార్పు..
    డిసెంబర్ 13న ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో మ్యాచ్‌

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్‌–శ్రీలంక జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. తొలుత ఢిల్లీలో నిర్వహించేందుకు నిర్ణయించిన ఈ మ్యాచ్‌ను విశాఖకు మారుస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 13న జరగాల్సిన మ్యాచ్‌ తేదీలో ఎలాంటి మార్పు లేదని, కేవలం వేదికను మాత్రమే మార్చినట్లు స్పష్టం చేసింది.

ఢిల్లీలో డిసెంబర్‌ నెలలో నెలకొనే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు స్టేడియంలో చేపట్టాల్సిన పునరుద్ధరణ పనుల నేపథ్యంలో మ్యాచ్‌ వేదికను మార్చాలని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌ (డీడీసీఏ) బీసీసీఐని కోరింది. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన బీసీసీఐ తొలి వన్డేను విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో డిసెంబర్‌ 13న జరగనున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విశాఖ క్రికెట్ అభిమానులకు దక్కనుంది.

శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొననుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌

  • తొలి వన్డే: డిసెంబర్ 13, ఆదివారం – విశాఖపట్నం (మధ్యాహ్నం 2 గంటలకు)

  • రెండో వన్డే: డిసెంబర్ 16, బుధవారం – బెంగళూరు (మధ్యాహ్నం 2 గంటలకు)

  • మూడో వన్డే: డిసెంబర్ 19, శనివారం – అహ్మదాబాద్ (మధ్యాహ్నం 2 గంటలకు)

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌

  • తొలి టీ20: డిసెంబర్ 22, మంగళవారం – రాజ్‌కోట్ (రాత్రి 7 గంటలకు)

  • రెండో టీ20: డిసెంబర్ 24, గురువారం – కటక్ (రాత్రి 7 గంటలకు)

  • మూడో టీ20: డిసెంబర్ 27, ఆదివారం – వేదిక వివరాలు అందుబాటులో లేవు (రాత్రి 7 గంటలకు)


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్