గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కడప జిల్లా ముద్దనూరులో దంపతుల ఆత్మహత్య..

3 గంటల క్రితం

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప జిల్లా) : అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ఉప్పలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఉప్పలూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు పల్లా సావిత్రమ్మ (66), పల్లా ప్రభాకర్ (70) కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం రెండేళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయి కడపలో బాడుగ ఇంట్లో ఉంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం కడప నుంచి స్వగ్రామానికి వచ్చిన వారు... గురువారం తమ ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరికి వివాహమైన ఇద్దరు కుమార్తెలున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్