గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజనవరి 14నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్‌: బిసిసిఐ

15 గంటల క్రితం

wpl.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అక్టోబర్‌ 28న కొచ్చీలో వేలం

​ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్‌) సీజన్‌-5 షెడ్యూల్‌ను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బిసిసిఐ) ప్రకటించింది. 2027లో జరిగే డబ్ల్యుపిఎల్‌ ఐదో సీజన్‌ సంబంధించి షెడ్యూల్‌తోపాటు వేలం జరిగే తేదీలను బిసిసిఐ తాజా ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ 28న కొచ్చిలో సీజన్‌-5 డబ్ల్యుపిఎల్‌ వేలం జరుగనున్నట్లు, వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నీ జరగనున్నట్లు వెల్లడించింది. రిటెన్షన్‌ ప్రక్రియకు సెప్టెంబర్‌ 28 చివరి తేదీగా పేర్కొంది. టోర్నీకి సంబంధించిన వేదికలను మాత్రం బిసిసిఐ ప్రకటించలేదు. 2026 సీజన్‌లో డబ్ల్యుపిఎల్‌ మ్యాచ్‌లు జరిగిన ముంబయి, వడోదరలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐదు జట్లకు ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్‌పై నిర్ణయం తీసుకునేందుకు సెప్టెంబర్ 28 వరకు గడువు ఇచ్చారు. ప్రతి జట్టులో గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లు ఉండవచ్చు. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సైకిల్‌కు సంబంధించిన జట్టు శాలరీ క్యాప్ రూ.15 కోట్లుగా ఉంది.

కాగా, గత డబ్ల్యుపిఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, రెండో టైటిల్‌ను కైవసం​ చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్