వెస్టిండీస్‌పై 38పరుగుల తేడాతో గెలుపు
లార్డ్స్ వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 38 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో గ్రూప్-బిలో వరుసగా నాల్గో గెలుపుతో ఇంగ్లండ్ మహిళలజట్టు సెమీస్‌కు చేరగా.. రెండో బెర్త్‌కోసం వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు రేసులో ఉన్నాయి. గ్రూప్-బిలో భాగంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. వాట్ హోడ్జే(65) అర్ధసెంచరీకి తోడు హీథర్ నైట్(43) బ్యాటింగ్‌లో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లు అష్మినికి రెండు, హెన్రీ, మాథ్యూస్, కరిష్మాలకు ఒక్కో వికెట్ దక్కాయి. అనంతరం ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 148పరుగులే చేసింది. కెప్టెన్ మాథ్యూస్(14), డోటిన్(19) నిరాశపరిచినా.. హెన్రీ(51నాటౌట్), క్లాస్టన్(21), క్యాంప్‌బెలె(20) బ్యాటింగ్‌లో రాణించారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఛార్లొటే డీన్‌కు ఎండు, లారెన్ బెల్, స్మిత్, ఎక్లేస్టోన్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వాట్ హోడ్జేకు దక్కింది. గ్రూప్-బి చివరి లీగ్ మ్యాచ్‌లో 27న ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. విండీస్ జట్టు ఐర్లాండ్‌తో, శ్రీలంక జట్టు స్కాట్లాండ్‌తో చివరి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు సెమీస్ రేసునుంచి ఇప్పటికే నిష్ర్కమించాయి.









కామెంట్‌లు (0)