mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబీచ్ షాక్స్ జిఒ ప్రతులు దహనం

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - గాజువాక (విశాఖపట్నం) ​ : సముద్ర తీరంలో బార్‌ ‌షాపులకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 362ను తక్షణం రద్దు చేయాలంటూ జివిఎంసి 69వ వార్డు పరిధి షీలా నగర్‌‌లో ఐద్వా ఆధ్వర్యాన శుక్రవారం నిరసన చేశారు. బీచ్‌ షాక్స్‌‌కు ఉద్దేశించిన జిఒ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి వై సత్యవతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విశాఖ, చీరాలతో బీచ్‌ ‌షాక్స్‌ ‌పేరిట బార్ షాపులు పెట్టేందుకు చూస్తోందన్నారు. సముద్ర తీరం ప్రజలదని, ఎంతో మంది ఆహ్లాదం కోసం ఇక్కడకు వస్తుంటారని, అటువంటి చోట మద్యం అమ్మకాలు దారుణమని తెలిపారు. ఇప్పటికే విశాఖలో మద్యం షాపులు పుట్టగొడుగుల్లా ఉండడంతో అకృత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు నడుస్తున్నాయన్నారు. డ్రగ్స్, మద్యంతో యువత పెడదోవ పడుతోందని వివరించారు. గోవా తరహాలో విశాఖ బీచ్‌‌ను తయారు చేస్తామని ఎమ్మెల్యేలు, ఎంపిలు చెప్పడం దారుణమన్నారు. తీరంలో బార్‌‌ షాపులు పెడతామంటే మహిళా లోకం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జి మణి, దేవుడమ్మ, మానస, మల్లిక, గీత, మాధవి, సునీత, మాధురి, విన్నీ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్