టీమ్‌ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో సీనియర్ ఆటగాళ్లు ఉన్న ఈస్ట్ జోన్ జట్టుకు ఆదివారం నాయకత్వం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ ఇషన్ కిషన్ గాయపడి మైదానం వీడడంతో అంతకముందు వైస్ కెప్టెన్ గా ఉన్న వైభవ్, కెప్టెన్ భాధ్యతలు అందుకున్నాడు. అలానే తన కెరియర్ లో కెప్టెన్ గా మొదటిసారి డిఆర్ఎస్ తీసుకోగా అది కాస్తా విజయవంతం కావడంతో జట్టు మెత్తం సంభరాలు చేసుకున్నాయి. ఈస్ట్‌జోన్ జట్టులో సీనియర్ పేసర్ మహ్మద్ షమీతోపాటు ముకేశ్ కుమార్, అభిమన్యు ఈశ్వరన్, కుమార్ కుషాంగ్రా, అనుకుల్ రాయ్ వంటి ఆటగాళ్లను ఈ 16 ఏళ్ల సంచలనం ముందుండి నడిపిస్తున్నాడు. మొదటి రోజు ఆటే ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 266 పరుగులకి ఆలౌట్ అయింది.
Print Editionనాయకత్వ బాధ్యతల్లోకి యువ సంచలనం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 30, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)