mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA: మెక్సికో బోణీ

5 రోజుల క్రితం

fifa mexico
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 11:48 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దక్షిణాఫ్రికాపై 2-0తో గెలుపు – ముగ్గురికి రెడ్ కార్డులు

మెక్సికో సిటీ : 23వ ఫిఫా ప్రపంచకప్ ప్రారంభోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత ప్రారంభమైన తొలి మ్యాచ్ లో ఆతిథ్య మెక్సికో జట్టు శుభారంభం చేసింది. గ‌తంలో 1970, 1986లో మెక్సికో సిటీలోని ఫేమ‌స్ అజ్‌టెకా స్టేడియంలోనే ఈసారీ ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. దీంతో మూడోసారి వరల్డ్ కప్ ప్రారంభోత్సవాలు జరుపుకున్న తొలి స్టేడియంగా ‘ఎస్టాడియో అజ్టెకా’ సరికొత్త చరిత్ర సృష్టించింది. 80 వేల మందికి పైగా అభిమానులు ‘మెక్సికో గ్రీన్’ జెర్సీలతో నిండిపోయిన వేళ.. మ్యాచ్ ప్రారంభమైన కేవలం 9వ నిమిషంలోనే జూలియన్ క్వినోనెస్ సూపర్ గోల్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. సౌదీ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న క్వినోనెస్ కొట్టిన ఈ గోల్.. గత 20 ఏళ్ల వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌ల చరిత్రలోనే అత్యంత వేగవంతమైన గోల్‌గా రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికా డిఫెన్స్‌ను ముక్కలు చేస్తూ మెక్సికో వెటరన్ స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ రెండో అర్ధభాగంలో హెడర్ ద్వారా అద్భుతమైన రెండో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ఈ గోల్‌తో మెక్సికో తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా రౌల్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో మెక్సికో మరో అద్భుతానికి తెరతీసింది. కేవలం 17ఏళ్ల 240 రోజుల వయసున్న గిల్బెర్టో మోరాను రంగంలోకి దించి.. వరల్డ్ కప్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన మెక్సికన్ ఆటగాడిగా రికార్డు సృష్టించింది. గత 2022 వరల్డ్ కప్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించిన మెక్సికో, ఈసారి లీగ్‌ను విక్టరీతో ప్రారంభించి 3 పాయింట్లతో గ్రూప్-ఎలో అగ్రస్థానంలో నిలిచింది.

తొలి మ్యాచ్‌లోనే ముగ్గురికి రెడ్ కార్డులు
ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆట‌గాళ్ల‌కు రెడ్ కార్డ్ జారీ చేశారు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు వై. సిథోల్‌, టీ జ్వానేతో పాటు మెక్సికో ప్లేయ‌ర్ సీ మోంటిస్‌కు రెడ్ కార్డ్ ఇచ్చాడు. ఈ రెడ్ కార్డులను బ్రెజిల్‌కు చెందిన రిఫ‌రీ విల్ట‌న్ సాంపాయో ఆట‌గాళ్లపై విధించాడు. దీంతో ఈ ముగ్గురు ఆట‌గాళ్లు తొలి మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు 2-0గోల్స్ ఓటమిపాలవ్వగా.. చివరి వరకు పోరాడిన ద‌క్షిణాఫ్రికా ఒక్క గోల్స్ చేయ‌లేక‌పోయింది. దక్షిణాఫ్రికా ఒక ద‌శ‌లో కేవ‌లం 9 మంది ఆట‌గాళ్ల‌తో మాత్ర‌మే ఆడింది. 2022లో ఖ‌తార్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టోర్నీ మొత్తమ్మీద కేవ‌లం నలుగురు ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే రెడ్ కార్డ్స్ కు గురికాగా.. ఈసారి టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ముగ్గురు ఆట‌గాళ్ల‌కు రెడ్‌కార్డ్ ఇవ్వ‌డం చ‌ర్చాంశంగా మారింది. ఫిఫా ర్యాంకుల్లో మెక్సికో 14వ స్థానంలో ఉంది.

ఫిఫా ప్రపంచకప్ లో నేడు…
13(శని) : అమెరికా × పరాగ్వే (తె.6.30గం||లకు)
14(ఆది) : కెనడా × బోస్నియా (తె.12.30గం||లకు), బ్రెజిల్ × మొరాకో (తె.3.30గం||లకు)

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్