సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA World Cup: ఫైనల్‌ ‌బెర్త్‌ ఎవరిదో...!

4 గంటల క్రితం

frence vs spain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఫిఫా ప్రపంచ కప్‌ తొలి సెమీఫైనల్‌

  • అర్ధరాత్రి 12.30గం.లకు

​న్యూయార్క్‌: ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ చివరి దశకు చేరుకుంది. 2022 టైటిల్‌ ‌విజేత అర్జెంటీనా, రన్నరప్‌ ‌ఫ్రాన్స్‌ ఈ ఏడాది కూడా టైటిల్‌ ‌రేసులో ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్‌, స్పెయిన్‌ ‌జట్లు ఫైనల్‌ ‌బెర్త్‌‌కోసం తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు ఇంగ్లండ్‌‌తో పోటీపడనుంది. తొలి సెమీస్‌‌లో తలపడే ఇరుజట్లు మాజీ ఛాంపియన్లు. స్పెయిన్‌ ‌జట్టు ఒకసారి, ఫ్రాన్స్‌ ‌జట్టు రెండుసార్లు ఈ టైటిల్‌‌ను గతంలో సాధించాయి. బలమైన డిఫెన్స్‌‌కు మారుపేరైన మాజీ ఛాంపియన్‌ ‌స్పెయిన్‌‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయ డానికి వీల్లేదు. 2010లో తొలిసారి టైటిల్‌ ‌కొట్టిన స్పెయిన్‌.. ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో సుదీర్ఘకాలం టాప్‌ ‌ర్యాంక్‌‌లో కొనసా గింది. ఈ టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్‌ ‌జట్టు ప్రత్యర్ధి జట్టుకు కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే సమర్పించు కుంది. దీంతో ఈసారి రెండో ప్రపంచ కప్ టైటిల్ కొట్టడం ఖాయంగా కనబడుతోంది. ఇక 1998, 2018లో రెండుసార్లు టైటిల్‌ కొట్టిన ఫ్రాన్స్‌ ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇక ఫ్రాన్స్‌కు కెప్టెన్ ఎంబాపే రూపంలో కొండంత అండగా ఉంది.

ఇరుజట్లు యూరో 2024, గత ఏడాది నేషన్స్ లీగ్ సెమీఫైనల్స్‌ ‌మ్యాచుల్లో తలపడ్డాయి. ఆ రెండు సందర్భాల్లోనూ స్పెయిన్ జట్టు ఫ్రాన్స్‌ను ఓడించింది. ఈ క్రమంలో ఫిఫా సెమీఫైనల్‌ ‌మ్యాచ్‌ ‌ప్రారంభానికి ముందే ఫ్రాన్స్ సెంటర్-బ్యాక్ కోనాటే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు’ గతం.. గడిచిపోయింది. స్పెయిన్ ఒక అసాధారణమైన జట్టే.. వారి వద్ద బలమైన డిఫెన్స్‌ ఉన్నమాట వాస్తవమే. లామిన్ (యమాల్) గొప్ప ఆటగాడే... అయినా మేం కేవలం ఒకే ఆటగాడిపై దృష్టి పెట్టి ఆడం.. అని క్వార్టర్‌‌ఫైనల్లో నార్వేపై చివరి నిమిషంలో గోల్‌ ‌కొట్టిన కోనాటే తెలిపాడు. ఇక ఫ్రాన్స్ ఈసారి కూడా తుదిపోరుకు అర్హత సాధిస్తే.. వరుసగా నాలుగోసారి అవుతుంది. దీంతో గతంలో 1974 నుండి 1990 మధ్య నాలుగు ఫైనల్స్‌కు చేరిన పశ్చిమ జర్మనీతో సరి సమానం నిలువనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్