మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవాన చుక్క కోసం ...

1 గంట క్రితం

farmer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ఆకాశం కేసి చూసే అన్న దాతలు

కారు మబ్బుల గుంపులు లేవు

కిరణ కిరీటాలు తలపై పెట్టుకుని

ద్యుమణి కదులుతున్నాడు..!

నీలాల నింగి వెక్కి వెక్కి ఏడ్చి

ఏడు నెలల కాలాతీతమయింది

నేల తల్లి తల తడవనూ లేదు

వేడెక్కిపోయిన పుడమి నానలేదు

భూగర్భ జలాలు కంటికి కనపడక

ధరణికి గుండె దడ మొదలాయే..!

ఏరువాకకు అదును పోయింది

విత్తులు విసిరినా పదును ఆవిరి

మొలకెత్తిన మొలక తల వాల్చింది

రైతుల ఆశలు ఆదిలో హంస పాదు..!

ఊర చెరువుల నోరెండిపోయాయి

దిగుడు బావిలో చెలమ జాడలేదు

మోడు బారిన చెట్లు నిట్టూర్పులు

గూడు చెదిరిన బతుకులు కన్నీరు..!

ఆకాశంలో మబ్బులు గుమి గూడి

వట్టిపోయే ఈచుకు పోయిన పశువుల్లా

ఎల్ నినో ప్రభావంతో కరువు కోరలు

ఎండిన ముఖాలలో కన్నీటి చారికలు..!

- జి. సూర్యనారాయణ,

సెల్‌: 6281725659

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్