స్వీడన్‌తో మ్యాచ్ డ్రా
గ్రూప్-ఎఫ్ నుంచి జపాన్, స్వీడన్ జట్లు నాకౌట్‌కు చేరుకున్నాయి. డల్లాస్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఏ జట్టూ గోల్ చేయలేదు. అయితే, 56వ నిమిషంలో డైజెన్ మెయిడా గోల్ కొట్టడంతో జపాన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఆరు నిమిషాలకే స్వీడన్ ప్లేయర్ ఆంటోని ఎలాంగా గోల్ కొట్టి 1-1తో సమం చేశాడు. అనంతరం ఆఖరి వరకు ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో జపాన్ ఒక గెలుపు, రెండు డ్రాలతో 5పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ కు చేరింది. ఇదే గ్రూప్ లో ఉన్న నెదర్లాండ్స్ జట్టు చివరి లీగ్ మ్యాచ్ లో ట్యునీషియాపై గెలిచి టాపర్‌గా నాకౌట్‌కు చేరింది. కాన్సాస్ సిటీ వేదికగా శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 3-1తో ట్యునీషియాను చిత్తు చేసింది. మూడో నిమిషంలోనే ట్యునీషియా కెప్టెన్ ఎల్లీస్ స్కిరి పొరపాటున ఓన్‌గోల్‌గా మలచడంతో డచ్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో మూడింట రెండు గెలిచి ఒక మ్యాచ్ డ్రా చేసుకుని ఏడు పాయింట్లతో నెదర్లాండ్స్ గ్రూప్ టాపర్గా నాకౌట్‌కు చేరింది.









కామెంట్‌లు (0)