ఖతార్ పై స్విట్జర్లాండ్ ఘన విజయం
లాస్ ఏంజెలెస్ : ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-బిలో స్విట్జర్లాండ్ బోస్నియా అండ్ హెర్జెగోవిపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి రెండు గోల్స్ చేసి జట్టుకు విజయాన్నందించాడు. ఖతార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విట్జర్లాండ్.. రెండో లీగ్ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి అర్ధభాగం నిరాశాజనకంగా సాగినా.. రెండో అర్ధభాగంలో జట్టు దూకుడు పెంచి వరుస గోల్స్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ముఖ్యంగా జోహాన్ మంజాంబి రెచ్చిపోయాడు. తొలి గోల్‌ను బలమైన షాట్‌తో నమోదు చేసిన అతడు.. ఆ తర్వాత మరో గోల్ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. 20 సంవత్సరాల 247 రోజుల వయసులో ప్రపంచకప్ మ్యాచ్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన అత్యంత పిన్న వయస్కుడైన స్విస్ ఆటగాడిగా మంజాంబి చరిత్ర సృష్టించాడు. అలాగే బెంచ్ నుంచి వచ్చి స్విట్జర్లాండ్ తరఫున ప్రపంచకప్‌లో ఒకటి కంటే ఎక్కువ గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మంజాంబి గోల్ తర్వాత మరో ప్రత్యామ్నాయ ఆటగాడు రూబెన్ వర్గాస్ కూడా గోల్ చేసి స్విట్జర్లాండ్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. మ్యాచ్ మలుపు తిరగడానికి బోస్నియా ఆటగాడు తారిక్ ముహరేమోవిచ్‌కు రెడ్ కార్డు పడటం కూడా కీలక కారణమైంది. బ్రెల్ ఎంబోలోపై ప్రొఫెషనల్ ఫౌల్ చేయడంతో అతడిని మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో బోస్నియా పది మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చింది. అదనపు సమయంలో ఎర్మిన్ మహ్మిచ్ ఒక అద్భుత గోల్ చేసి బోస్నియాకు ఓదార్పు గోల్ అందించినప్పటికీ.. తిరిగి పుంజుకునే అవకాశం లభించలేదు. మ్యాచ్ చివర్లో స్విట్జర్లాండ్ కెప్టెన్ గ్రానిట్ జాకా పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 4-1కు చేర్చాడు. దీంతో గ్రూప్^-బిలో రెండో లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి స్విట్జర్లాండ్, కెనడా 4 పాయింట్లతో టాప్-2లో కొనసాగుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌తో కెనడా, బోస్నియాతో ఖతార్ తలపడనున్నాయి. దీంతో ఈ గ్రూప్‌లో ఈ రెండు మ్యాచ్‌లు కీలకంగా మారాయి.
ఫిఫా ప్రపంచకప్‌లో
నేడు 20(శని): బ్రెజిల్ × హైతీ (తె.6.30గం.లకు)
టర్కీ × పరాగ్వే (ఉ.8.30గం.లకు)
నెదర్లాండ్స్ × స్వీడన్ (రా.10.30గం.లకు)
21(ఆది): జర్మనీ × ఐవరీకోస్ట్ (తె.1.30గం.లకు)
ఈక్వెడార్ × కురసావ్ (తె.3.30గం.లకు)









కామెంట్‌లు (0)