mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

30న గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం

2 గంటల క్రితం

murnu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ప్రజాశక్తి-విజయనగరం టౌన్: విశాఖలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయగిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం ఈ నెల 30న నిర్వహిస్తున్నామని ఉప కులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్నాతకోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. 2021-26 విద్యా సంవత్సరాల మధ్య వివిధ ప్రోగ్రాంలు పూర్తి చేసుకున్న సుమారు 400 మంది విద్యార్థులకు ఆమె డిగ్రీ పట్టాలను అందజేయనున్నారని, ప్రతిభ కనబరిచిన సుమారు 15 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నట్లు విసి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం చరిత్రలో ఇది అత్యంత కీలకమైన ఘట్టమని, ఈ కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, యూనివర్సిటీ వర్గాలు భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్