చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
బీజింగ్: చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలిరోజు భారత షట్లర్లకు నిరాశ తప్పలేదు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో హెచ్‌ఎస్ ప్రణయ్ 10-21, 14-21తో వరుససెట్లలో మలేషియాకు చెందిన లియోంగ్ జిహో చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ తన స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చలేకపోయాడు. దీంతో తొలిరౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టాడు. మరో పోటీలో దేవిక్ సిహాగ్ 19-21, 21-19, 13-21తో ఆంగ్‌బురాఫన్ (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌ను పోరాడి నెగ్గిన సిహాగ్.. రెండో గేమ్‌లో అదే వ్యత్యాసంతో ఓటమిపాలయ్యాడు. ఇక నిర్ణ యాత్మక మూడో, చివరి గేమ్‌లో ఇండోనేషియా ప్లేయర్ పుంజుకోవడంతో ఓటమిపాలయ్యాడు. బుధవారం సింధు తొలిరౌండ్‌లో పోటీపడనుంది.








కామెంట్‌లు (0)