121 బంతుల్లో 126 పరుగులు.. భారత విజయంలో కీలక పాత్ర
క్రీడలు : జ్వరం వేధిస్తున్నా, అలసట ఇబ్బంది పెడుతున్నా వాటిని అధిగమించి హర్మన్‌ప్రీత్ కౌర్ తన పోరాట పటిమను చాటుకున్నారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో భారత జట్టుకు అండగా నిలిచింది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరంతో బాధపడిన ఆమె.. మందులు, పెయిన్‌కిల్లర్స్ తీసుకుని మైదానంలోకి దిగింది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకుంది.
మూడో ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్ దాదాపు 43 ఓవర్లపాటు క్రీజులో నిలిచి 121 బంతుల్లో 126 పరుగులు సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ జట్టు స్కోరును పటిష్ఠ స్థితికి చేర్చింది. ఈ శతకాన్ని తాను ఎంతో ఆస్వాదించానని, తన బాధంతా మరిచిపోయానని ఆమె పేర్కొంది. వన్డే క్రికెట్‌లో పరిస్థితులకు అనుగుణంగా భిన్నమైన పాత్రలు పోషించాల్సి ఉంటుందని హర్మన్ తెలిపింది. ప్రతీకాతో కలిసి మంచి బంతులను గౌరవిస్తూ, చెత్త బంతులను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. సారథ్య బాధ్యతల తర్వాత ఆటను కొత్త ఉత్సాహంతో ప్రారంభించినట్లు అనిపిస్తోందని చెప్పింది. క్రీజులోకి వెళ్లిన తర్వాత ఇతర విషయాలను పక్కనపెట్టి, ఆటపైనే దృష్టి సారిస్తానని వివరించింది.
జ్వరంతోనే మైదానంలోకి ...
మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి జ్వరం రావడంతో ఇబ్బంది పడినట్లు హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. మంచి ఎండలో బ్యాటింగ్ చేయాల్సి రావడం మరింత సవాలుగా మారిందని తెలిపింది. ఫీల్డింగ్ సమయంలోనూ అసౌకర్యానికి గురయ్యానని, విశ్రాంతి తీసుకోవాలనిపించినప్పటికీ పెయిన్‌కిల్లర్స్ తీసుకుని ఆట కొనసాగించినట్లు వివరించింది. మందులు తీసుకోవడం తనకు కొంత ఉపశమనం కలిగించిందని పేర్కొంది.
హర్మన్ ఇన్నింగ్స్ కీలకం : స్మృతి మంధాన
భారత విజయంలో హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ప్రతీకా, దీప్తి శర్మ కీలక పాత్ర పోషించారని కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసించింది. కేవలం 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన హర్మన్ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిందని పేర్కొంది. ప్రతీకా, దీప్తి శర్మలతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును ఆదుకుందని తెలిపింది. దీప్తి శర్మ కూడా ఈ మ్యాచ్‌లో తనకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుందని స్మృతి వెల్లడించింది. సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం వల్ల ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉండదని, ఈసారి మాత్రం దీప్తి తన ప్రతిభను చాటుకుందని వివరించింది. భారత బౌలర్లు కూడా జింబాబ్వే బ్యాటర్లను సమర్థంగా కట్టడి చేశారని పేర్కొంది. పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్మృతి మంధానకు ఇదే తొలి వన్డే సిరీస్ కావడం విశేషం.







కామెంట్‌లు (0)