సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలికపై హత్యాచార ఘటన - నిందితుడు జనసేన అభ్యర్థి బంధువు

1 గంట క్రితం

Rape and murder of a young girl – Accused is a relative of a Jana Sena candidate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 01:23 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆరేళ్ల బాలిక పై హత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు

- నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు


ఒంగోలు సిటీ (ప్రకాశం) : నాగులుప్పలపాడు మండలంలో ఆరేళ్ల బాలిక హత్యాచారానికి గురైన ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి, నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒంగోలులోని జీజీహెచ్‌ మార్చురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని త్వరితగతిన అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దర్యాప్తును పకడ్బందీగా పూర్తి చేసి, సేకరించిన ఆధారాలను న్యాయస్థానంలో సమర్పించి, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. జీజీహెచ్‌ వైద్యులు డాక్టర్ ఎన్ కిరణ్‌కుమార్‌, వరుణ్‌తేజతో పాటు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఏ. పద్మ సునందతో ఎస్పీ మాట్లాడారు. బాలిక మృతి ఘటనకు సంబంధించిన వివరాలు, వైద్యపరమైన అంశాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు.

నిందితుడు


నిందితుడు చదలవాడ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి సన్నీ స్వంత పెద్దమ్మ కొడుకు ....

ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, నాగులుప్పలపాడు మండలం, చదలవాడ గ్రామంలో దారుణం జరిగింది. చదలవాడ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి సన్నీ స్వంత పెద్దమ్మ కొడుకు అజ్జం ఆనంద్ అనే యువకుడు ఐదు సంవత్సరాల మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపాడు. ఆదివారం రాత్రి సుమారుగా అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న మైనర్ బాలికపై అజ్జం ఆనంద్ మద్యం మత్తులో అత్యాచారం చేసి దారుణంగా చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్ ను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్ హాస్పటల్ కు తరలించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్