సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉంగుటూరులో ఎన్నికల హడావుడి - బ్యాలెట్ బాక్సులు రెడీ

2 గంటల క్రితం

Election bustle in Unguturu – Ballot boxes ready
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- ఉంగుటూరు (ఏలూరు) : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఉంగుటూరు మండల పరిషత్ ప్రాదేశిక వర్గం ఎన్నికల నిర్వహణకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు మండల కేంద్రానికి చేరుకున్నాయి. మండల పరిధిలోని మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు గాను 64045 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు 79 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బంది బ్యాలెట్ పెట్టెలను క్లీన్ చేసి, అవసరమైన ఆయిల్, గ్రీజు వేస్తూ సమర్థవంతంగా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా బ్యాలెట్ పెట్టెలను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్