- మిక్సిడ్ డబుల్స్‌లో జతకట్టిన అల్కరాజ్-సెరేనా
- యుఎస్ ఓపెన్ మెయిన్ డ్రా విడుదల
న్యూయార్క్: ఈనెల చివర్లో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నొవాక్ జకోవిచ్, అర్యానా సబలెంకాలకు టాప్‌సీడింగ్స్ దక్కాయి. టోర్నీ నిర్వాహకులు ఆదివారం మెయిన్ డ్రాను విడుదల చేశారు. తొలిరౌండ్‌లో నొవాక్ జకోవిచ్(సెర్బియా) అమెరికాకు చెందిన ఫ్రాన్సిస్ టఫీతో తలపడనున్నాయి. ఇక అర్యానా సబలెంక(బెలారస్) తొలిరౌండ్‌లో అమెరికా క్వాలిఫయర్ ఫెర్నాండెజ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో కార్లోస్ అల్కరాజ్-సెరేనా విలియమ్స్ కలిసి బరిలోకి దిగుతున్నారు.
ఈ జంట తొలిరౌండ్‌లో క్వాలిఫయర్స్‌తో తలపడనున్నారు. అల్కరాజ్ దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ రాకెట్ పట్టనున్నాడు. ఈ టోర్నీకి యుఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ విజేత జెన్నిక్ సిన్నర్ గాయం కారణంగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.








కామెంట్‌లు (0)