బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఈస్ట్‌‌జోన్‌‌కు ఆధిక్యత

1 గంట క్రితం

trophy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 11:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేటితో ముగియనున్న దులీప్‌ ‌ట్రోఫీ ఫైనల్‌

చెన్నై: దులీప్‌ ‌ట్రోఫీ-2026 టైటిల్‌‌కు ఈస్ట్‌‌జోన్‌ ‌చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌‌లో సౌత్‌‌జోన్‌‌పై ఆధిక్యత సంపాదించిన ఈస్ట్‌‌జోన్‌ ‌జట్టు రెండో ఇన్నింగ్స్‌‌లో నాల్గోరోజు ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఇప్పటికే 584పరుగుల ఆధిక్యతను సంపాదించిన ఈస్ట్‌‌జోన్‌ ‌జట్టుకు దాదాపు టైటిల్‌ ‌దక్కినట్లే. ఓవర్‌‌నైట్‌ ‌స్కోర్‌ 6 ‌వికెట్ల నష్టానికి 242 పరుగులతో నాల్గోరోజు ఆటను కొనసాగించిన సౌత్‌‌జోన్‌ ‌జట్టు 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ ‌తిలక్‌ ‌వర్మ(99) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఔటయ్యాడు. శ్రేయస్‌ ‌గోపాల్‌(26), రవిచంద్రన్‌(24), మిలింద్‌(43) ‌బ్యాటింగ్‌‌లో రాణించగా.. త్రిపురణ విజయ్‌(1), సిరాజ్‌(1) స్వల్ప స్కోర్లకే పెవీలియన్‌‌కు చేరారు. సౌత్‌‌జోన్‌ ఇన్నింగ్స్‌ 107.3ఓవర్లలో 336పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఈస్ట్‌‌జోన్‌ జట్టుకు 372పరుగుల భారీ ఆధిక్యత లభించింది. ఈస్ట్‌‌జోన్‌ ‌బౌలర్లు ముఖేష్‌‌కుమార్‌‌కు మూడు, షమీ, ఖురేషీ, మోహన్‌‌కు రెండేసి వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌‌జోన్‌ బ్యాటర్లు మోహన్‌(52), కెపెట్న్‌ ఇషాన్‌ (80) అర్ధసెంచరీలతో రాణించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్