కివీస్ మూల్యం చెల్లించుకుంది : రమేష్
న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో మూడో టీ 20లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ చెలరేగాడని మాజీ క్రికెటర్ శఠగోపన్ రమేష్ వ్యాఖ్యానించారు. వైభవ్‌కు ఓపెనింగ్ స్థానం చాక్లెట్ లాంటిదని, అతడి దూకుడు బ్యాటింగ్ కు న్యూజిలాండ్ మూల్యం చెల్లించుకుందని పేర్కొన్నారు. రెండో టీ20లో వన్‌డౌన్ లో వచ్చి నాలుగు పరుగులకే ఔటైన వైభవ్.. మూడో మ్యాచ్‌లో మాత్రం 19 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 45 పరుగులు చేశారు. మరోవైపు అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ కలిసి ఏడు ఓవర్లలోనే తొలి వికెట్‌కు 133 పరుగులు సాధించడం అసాధారణమని రమేష్ కొనియాడారు. ఈ మ్యాచ్‌లో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.








కామెంట్‌లు (0)